ఐసీడీఎస్ ప్రాజెక్టులో బ్లాక్ ప్రాజెక్ట్ కో ఆ ఆర్డినేటర్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మెనేజర్ మాధురి తెలిపారు. అభ్యర్థులు సోషల్ సైన్స్, న్యూట్రిషన్, హోమ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీలలో పోస్టు గ్రాడ్యుయేషన్ కలిగి ఉండి సంబంధిత రంగంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థలలో రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. దోర్నాల, గిద్దలూరు ప్రాజెక్టులలో బ్లాక్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ పోస్టులు ఒక్కోక్కటి చొప్పున ఖాళీ ఉన్నట్లు తెలిపారు. దోర్నాల లో బీసీ (ఈ) మహిళ కు, గిద్దలూరులో ఎస్టీ (మహిళ)కు రిజర్వ్ చేసినట్లు చెప్పారు. అర్హల కలిగిన వారు ఈనెల 12 నుండి 20వ తేది వరకు దరఖాస్తులకు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయ్యాలని కోరారు. అర్హులైన వారి ని ఇంటర్య్వూ పిలుస్తామని వివరించారు.
ఐసీడీఎస్ లో బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
11
Nov