సూదనగుంట ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూదనగుంట కోటయ్య చౌదరి & ఆదిలక్ష్మి మెమోరియల్ 71 వ సీనియర్ అంతర్ జిల్లాల పురుషులు & మహిళల కబడ్డీ పోటీల పోస్టర్ ను ఈరోజు ఒంగోలులోని ప్రకాశం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ , ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
ఈ పోటీలు డిసెంబర్ 5 నుంచి 8 వరకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని శ్రీ సూదనగుంట కోటయ్య చౌదరి స్కూలు ప్రాంగణంలో ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుగులో జరుగుతాయి.
ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ జిల్లాల నుండి 13 పురుషులు మరియు 13 మహిళల జట్లు పాల్గొననున్నాయి.
ఈ టోర్నీలో పాల్గొనే జట్లకి శ్రీ సూదనగుంట ఫౌండేషన్ వారు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కల్పించనున్నారు.
ఈ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పురుషులు మరియు మహిళా క్రీడాకారులను జాతీయస్థాయిలో జరిగే ఆంధ్ర కబడ్డీ జట్టుకు ఎంపిక చేస్తారు.
అలాగే త్వరలో జరగనున్న తెలుగు కబడ్డీ ప్రీమియం లీగ్ కు కూడా ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.
