ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీఆర్ఎస్ ) లో వచ్చిన వినతులకు నాణ్యమైన, ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వాలి – రీ ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాలి – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీఆర్ఎస్ ) లో వచ్చిన వినతులకు నాణ్యమైన, ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వాలని, రీ ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జిల్లా అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, లోకేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. … జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో అర్జీదారులు వస్తారని, వచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీ దారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలపై సంబంధిత శాఖల జిల్లా అధికారి కచ్చితంగా పరిశీలన చేయాల్సిన అవసరం వుందన్నారు. పరిష్కరించిన ఆర్జీలను సంబంధిత జిల్లా అధికారులు ఒకసారి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఆర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా నిర్ణీత గడువులోపు నాణ్యతతో పరిష్కరించేలా అధికారులు శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీఆర్ఎస్ ) లో వచ్చిన వినతుల పరిష్కారినికి సంబంధించి ప్రతి శాఖలో ఒక ఆడిట్ టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అర్జీలు పెండింగ్, రీ ఓపెనింగ్ లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కర తీరు ఉండాలన్నారు.
ఈ నెల 19న జిల్లా వ్యాప్తంగా వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్యం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్ఫహించాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు.

ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 260 వినతులు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో సిపిఓ వేంకటేశ్వర రావు, డిటిసి సుశీల, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *