మెరుగైన సేవల కోసం ఎపీఎస్ఆర్టీసీ నెల రోజుల పాటు డిశంబర్ 15 వరకు సమయ పాలన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఒంగోలు డిపో మెనేజర్ ధర్మవరపు శ్రీనివాస రావు తెలిపారు. మాసోత్సవాలు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన సర్వీసులు సేవలు అందించమే లక్ష్యమని అన్నారు. మంచి కండిషన్ తో పాటు సమయానికి సర్వీసులు అందుబాటులో ఉంచితే ప్రయాణికులు ఇతర ఏ వాహనాలను ఆశ్రయించరని అన్నారు. గమ్యానికి చేరవలసిన సమయానికంటే ముందుగా చేర్చినట్లయితే ఆర్టీసీపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా పంచ రామాలతో పాటు అరుణా చలంకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ట్రూప్ వచ్చి సర్వీస్ అవసరమైతే ప్రత్యేక సర్వీసులు నడుపుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
