నైతిక విలువలు పాటిస్తూ విద్యార్థులు విద్యాబ్యాసం సాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వక్తలు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం బంగారు బాల్యం కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ బాగుపడాలంటే నైతిక విలువలు పాటిస్తూ చదువులు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఎంఈఓ -2 సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రర్థ తీసుకుంటున్నట్లు చెప్పారు. సూపర్ వైజర్ జ్యోతి మాట్లాడుతూ పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలని అన్నారు.
బాలల హక్కుల వారోత్సవాలను దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎరియా కోఆర్డినేటర్ తప్పెట డేవిడ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల లో నిర్వహించారు. బాలలు హక్కులు చట్టాలపై అవగాహన కల్పించారు. ఎంఈఓ పెద్ది రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కె పెద్ది రెడ్డి. గ్రామ కార్యదర్శి ఐ రమణా రెడ్డి, తదితరులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు.



