ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తూ చా తప్పకుండా పాటించాలని ట్రాఫిక్ సీఐ ఒంగోలు వై పాండురంగారావు కోరారు . School Bus/ Auto’s
ప్రతి ఆటో డ్రైవరు పిల్లలను పరిమితి సంఖ్యలో మాత్రమే ఎక్కించుకొనవలెను విధిగా యూనిఫామ్ ధరించి ఉండాలి పిల్లలను డ్రైవర్లకు ఇరువైపులా కూర్చోబెట్టరాదు సీటు కెపాసిటీ వరకు మాత్రమే పిల్లలను ఎక్కించుకొనవలెను ఆటోలో వెనుక వైపు వేలాడు లాగా కూర్చోబెటరాదు. స్కూల్ బస్సులు కూడా పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోకూరాదు , పిల్లలను ఎక్కించుకునేటప్పుడు మరియు దింపేటప్పుడు రోడ్డు సైడ్ మార్జిన్ లో మాత్రమే వాహనము ఆపవలెను మరియు వాహనము సంబంధించిన అన్ని పేపర్లు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండవలెను నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్ లైసెన్సులు RTO ద్వారా క్యాన్సిల్ చేయబడును. స్కూల్ యాజమాన్యం కూడా విధిగా ప్రతి రోజు పై తెలిపిన విషయాలు అన్నీ కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోవలెను
Helmet
రోడ్డు ప్రమాదాలలో అత్యధిక భాగం హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపడం వల్ల జరుగుతున్నవి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి . ISO Certified Helmet వాడడం ఉత్తమం
హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపే వారిపై చలనాలు విధించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది
INSURANCE
ప్రతి వాహనాదారుడు తమ వాహనానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలి మరియు అది ఫోర్స్లో ఉండేటట్లు రెన్యువల్ చేయించాలి ఫేక్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోబడును అదేవిధంగా ఫేక్ ఇన్సూరెన్స్ లో తయారు చేసే వారిపై కూడా క్రిమినల్ కేసులో రిజిస్టర్ చేయబడతాయి
BIKE RACING
ఒంగోలు నగరంలో బైక్ రేస్ లో పూర్తిగా నిషేధించడమైనది అటువంటివి నగర పరిధిలో నిర్వహించినట్లయితే వాటిని డ్రోన్ కెమెరా ద్వారా మరియు MUFTI సిబ్బంది ద్వారా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోబడును
పేరెంట్స్ పిల్లలకు హై స్పీడ్ వెహికల్స్ ఇప్పించినప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించుకోవాలి
ROAD SIDE SHOPS/ VENDORS
ఎవరైనా వ్యాపారస్తులు foot path , రోడ్డు ఆక్రమించి షాపులు, వస్తువులు ముందు భాగంలో పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగించినట్లయితే వారిపై కొత్త BNS చట్టా ప్రకారం చేసి కేసు రిజిస్టర్ చేసి 1000/- రూపాయల నుండి 5000/- వరకు కోర్టులో జరిమానా వించబడుతుంది
ప్రతి వాహనానికి తప్పనిసరిగా వాహన పేపర్లు ,డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి మరియు Modified Silencers పెట్టించరాదు,
వాహనానికి ముందువైపు, వెనుక వైపు తప్పనిసరిగా RTA approved IND నెంబర్ ప్లేటు మాత్రమే బిగించవలెను Drunken Drive డ్రైవ్ చేసిన వారికి పదివేల వరకు జరిమానా మరియు జైలు శిక్ష విధించబడుతున్నది.
వాహనం పేపర్లు , డిజిటల్ లైసెన్స్, పెండింగ్ చాలాన్ తదితర సేవల కొరకు
Google Playstore నుండి NextGen mParivahan App Download చేసుకొనవలెనని వివరించారు ,
