వెలుగుశాఖ ద్వారా డ్వాక్రా మహిళలకు 2016 నుండి 2018 వరకు పశు ఉన్నతి పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల గేదెలను మంగళవారం ప్రకాశం జిల్లా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు .ఈ సందర్భంగా శివరామపురం గ్రామంలో డి సి టి ఓ వి రామారావు, విజిలెన్స్ ఎస్సై జి నాగేశ్వరరావు, ఏరియా కోఆర్డినేటర్ వసుంధర దేవి,ఏపీఎం పి దేవరాజ్ , తదితరులు పాల్గొని తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెలను ఎప్పుడు కొన్నారు, ఎంత ఖరీదుకు కొనుగోలు చేశారు, ఇన్సూరెన్స్ సదుపాయం ఉన్నదా ? లేదా ? అనే అంశాలపై లబ్దిదారుల నుండి వివరాలు తెలుసుకొని గేదెలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిసి బి మోహన్, వివో ఏ అనపర్తి మనీషా, అనూరాధ, లబ్దిదారులు, సిబ్బంది పాల్గొన్నారు.


