పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు గ్రామాలలో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చెయ్యాలని ఎంపీడీఓ సుందర రామయ్య కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం గ్రామకార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ సుందర రామయ్య మాట్లాడుతూ …2024-25 సంవత్సరంకి నిర్ణయించిన బడిన డిమాండ్ పన్ను పన్ను యేతర డేటాను సిద్ధంగా ఉంచాలని అసెస్ మెంట్ కోసం ఫిజికల్ రికార్డులను అందుబాటులో ఉంచాలని కోరారు. మిగిలిన అదనపు సమాచార సేకరించాల్సిన అవసరం ఉన్నట్లయితే డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, గ్రామ సర్వేయర్లు ఇతర సచివాలయ సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పంచాయితీల వద్ద అందుబాటులో ఉన్న ఖచ్చితమైన డేటాతో పాటు అదనపు సమచారాన్ని కూడ సేకరించి రికార్డులను నవీకరించాల్సి ఉందని తెలిపారు. లోప రహితంగా ఖచ్చితమైన డేటాను సేకరించి వెబ్ పోర్టల్లో అప్డేడేట్ చేయటం పంచాయితీ కార్యదర్శి బాధ్యత అని చెప్పారు. నిబంధనల ప్రకారం ఇంటి యజమాని వివరాలు, సరియైన దృవ పత్రాల ప్రకారం ఉండేలా చూడాలని, క్షేత్ర స్థాయిలో పొరుగు వారి వివరాలు ఖచ్చితంగా ఉండేలా, ఇంటి పన్ను నిర్థారణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. డేటా మొత్తం సేకరించి పూర్తి స్థాయిలో పరిశీలన తర్వాత మాత్రమే గ్రామకార్యదర్శి ఆడేటాను భద్రపరచాలని చెప్పారు. ఈఓఆర్డీ, డీఎల్ పి ఓ , డిపీఓ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలన తర్వాత ఆటో జనరేట్ సర్టిఫికేట్ తో డేటా నిర్ధారించబడుతుందని చెప్పారు. నవంబర్ 30 నాటికి నూరు శాతం డేటా ఎంట్రీ జరిగేలా చూడాలని కోరారు. పంచాయితీలలో పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఆధార్ కేంద్రాలను పంచాయితీలలో ఏర్పాటు చేసి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిన ప్రజలకు , విద్యార్థులకు సమాచారం అందేలా చూడాలని చెప్పారు. ఎన్ పీ సీఎల్ లింక్ కాని వారికి లింక్ చేసి త్వరిత గతిన సేవలు అందించాలని సూచించారు.
