ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు సోషల్ మీడియా లో టి.డి.పి, జనసేన కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద వారి కుటుంబ సభ్యుల మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని వికృత చేష్టలపై చర్యలు తీసుకోవాలని తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం అందించారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టివి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదన్ రెడ్డి, గోళ్ళపాటి మోషే, మాజీ జెడ్పిటిసి ఎల్.జి వెంకటేశ్వర్ రెడ్డి, కోట కృష్ణారెడ్డి, సర్పంచి లు సుబ్బారావు ,వలి, బ్రహ్మ రెడ్డి , సొసైటీ చైర్మన్ జయరామిరెడ్డి ,కోఆప్షన్ నెంబర్ కరిముల్లా, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాదరెడ్డి, మాజీ సర్పంచ్ అంజిరెడ్డి, మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
