తాళ్లూరు-కొత్తపాలెంమార్గంలో గల
నేల బారు చప్టా పూర్తిగా పూడి పోయి రాకపోకలకు ప్రమాదకంగా వుండటంతో తాళ్లూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్వంలో పూడిక తీత పనులు చేపట్టారు. గురు వారం ఆ ప్రాంతంలో పూడిపోయిన కాలువపూడిక తీత పనులు చేయించారు. ఆ చప్టా రోడ్ కంటే తక్కువ ఎత్తులో వుంది. ఎగువ నుండి వచ్చే మురుగు నీరు ఆ చప్టా పూడి పోవటంతో నీరు కిందికి వెళ్లక చప్టామీదుగానే ప్రవహిన్నది. ప్రజలు రాక పోకలు సాగించే సమయంలో ఆమురుగునీటి దుర్గందం భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కష్టాలను గమనించిన ఎంపీడీవో సుందరరామయ్య చప్టా వద్ద పారిశుద్యపనులు చేపట్టాలని గ్రామకార్యదర్శిని ఆదేశించారు. ఎంపీడీవో ఆదేశానుసారం… పంచాయతీ నిధులతో గ్రామసర్పంచ్ చార్లెస్ సర్జన్, పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి ఆద్వర్యంలో
ప్రమాదకంగా వున్న చప్టా వద్ద ఇరువై పులా నిండివున్న పూడిక తీతను ప్రొక్లెయిన్ సహాయంతో తీయించారు. ఎంపీడీవో ఆదేశానుసారం కొత్తపాలెం, కొర్రపాటివారిపాలెం గ్రామాల్లో పంచాయతీ నిధులతో అన్ని వీధుల్లోని సైడు కాలువల పూడిక తీత పనులు చేయిస్తున్నారు.
