ప్రకాశం జిల్లా, కురిచేడు వద్ద గల NSP కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న వృద్ధుడిని రక్షించి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. వివరాల లోనికి వెలితే…
కురిచేడుకు చెందిన వి. బ్రహ్మారెడ్డి (సుమారు 69 సం”) కుటుంబ/ఆరోగ్య సమస్యల వలన మనస్తాపం చెంది తేదీ:11.11.2024 న మధ్యాహ్నం సుమారు 01.30 సమయంలో NSP కెనాల్ వద్దకు వెళ్లి దానిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోబోతున్న వృద్ధుడిని స్థానికులు చూసి కేకలు వేయడంతో అది గమనించిన కురిచేడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు విజయకుమార్ (పిసి. 283) మరియు ప్రసన్న బాబు (పిసి. 2459) వెంటనే స్పందించి ఈతగాళ్ళను కాలువలోకి దింపి వృద్ధుడు యొక్క ప్రాణాలను కాపాడినారు. అనంతరం ఆ వ్యక్తికి ఆత్మహత్యలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించి అతని యొక్క కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.
వెంటనే స్పందించి సదరు వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందికి వారి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. విధుల్లో అప్రమత్తంగా ఉంటూ మంచి పనితీరు కనబర్చిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.



