ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట, రాంగోపాల్ పేట డివిజన్ లకు చెందిన 7 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2.75 లక్షల రూపాయల విలువైన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తితే అశ్రద్ధ చేయకుండా ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అవసరమైన మెరుగైన చికిత్స చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, కిషోర్, ఆంజనేయులు, ఆరీఫ్, శేఖర్, కిరణ్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
