విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జీడీసీఓ మృధులత అన్నారు. కస్తూరిభా పాఠశాలలో విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్న విషయాలను తెలిసిన ఆమె శుక్రవారం అకస్మికంగా పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ప్రిన్సిపాల్, నాట్ టీచింగ్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్త మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు గుర్తించారు. సమన్వయ లోపం, వ్యక్తి గత దూషణలతో విద్యార్థులకు అందించాల్సిన సేవలు అందించటంతో తప్పిదం జరిగితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. విద్యార్థునులకు జ్వరం వచ్చి తాత్కాలికంగా రెండు రోజులు అయిన పాఠశాలలో ఆరోగ్య కార్యకర్త సమక్షంలో సేవలు అందించి ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తల్లిదండ్రులను పిలిచి నివాసాలకు వంటి రికవరీ అయిన తర్వాత పాఠశాలకు వెలిగించాలని సూచించారు. పాఠశాల వరిసరాలు, డైనింగ్ హాల్, మెనూ పరిశీలించారు. ప్రిన్సిపాల్ సుజిత, సిబ్బంది పాల్గొన్నారు.


