బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎన్ఐ మల్లిఖార్జునరావు అన్నారు. మండలంలోని పలు గ్రామాలలో బెల్ట్ దుకాణాలపై శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. తురక పాలెంలో దేశిరెడ్డి సుబ్బారెడ్డి దుకాణంపై దాడి చేసి ఎనిమిది క్వాటర్ బాటిళ్లను, మన్నేపల్లిలో ఆవుల యోగేందర్ రెడ్డి దుకాణంలో 7 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎఎన్ఐ మోహన రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

