రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చంనాయుడు ను దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు లలిత్ సాగర్ లు అమరావతిలోని మంత్రి ఛాంబర్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శిలో అర్థంతరంగా నిర్మాణం నిలిచి పోయిన కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలంటూ మంత్రి అచ్చం నాయుడును డాక్టర్ లక్ష్మి లలిత్ సాగర్ లు కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర మంత్రి త్వరలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు.
త్వరలో నిర్మాణం నిలిచిపోయిన దర్శి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకువస్తాము- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
22
Nov