తాళ్లూరు- తూర్పుగంగవరంలో పలు రోడ్ల రోడ్డు మరమ్మత్తులు
చేసి భారీగా రోడ్డును ఎత్తు పెంచారు. ముఖ్యంగా లింగాల పాడు, తూర్పుగంగవరం మధ్య మోకాలు లోతు పైగా రోడ్డు ఎత్తు పెరిగినది. సింగిల్ రోడ్ మొకాలు లోతు పైగా రోడ్డు పెరగటంతో రెండు వాహనాలు ఎదురుగా వస్తున్న సమయంలో మార్జిన్ దిగి సైడు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. దీంతో వాహనదారులు, ముఖ్యమంగా ద్విచక్ర వాహన దారుల పరిస్థితి తీవ్ర ప్రమాదకరంగా మారింది. రోడ్డు వేసారు సరే సైడు బర్మ్ లు వేయటంలో ఎందుకు అలస్యం అవుతుందో అర్థం కావటం లేదని వాహనదారులు వాపోతున్నారు. అదే విధంగా ఇంకా పలు చోట్ల దెబ్బతిన్న రోడ్డును సైతం బాగు చేయ్యాల్సిన అవశ్యకత ఉన్నది. ఇప్పటికైనా సంబంధిత ఆర్ అండ్ బి శాఖ స్పందించి రోడ్డు సైడ్ మార్జిన్ బర్మ్ లను ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
