మాధవరం సచివాలయంను అపరిశుభ్రత చుట్టుముట్టినది.
కార్యాలయం చుట్టూ పిచ్చి మొక్కలు భారీగా పెరిగి ఉన్న ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలనే ఆలోచనన అధికారులకు రాక పోవటం వారి నిర్లక్ష్యానికి నిలువద్దం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిత్యం సచివాలయం, రైతు సేవ కార్యాలయానికి పలు పనులపై వెళ్లే ప్రజలు రైతులు పొలాల మధ్యన ఉండే సచివాలయం, రైతు సేవ కేంద్రాల వద్ద ఆ పెరిగిన చెట్ల మధ్య విష పురుగులు ఉండే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు. నిత్యం స్వచ్చత గురించి వల్లె వేస్తున్న అధికారులకు తమ పరధిలో ఉన్న గ్రామ సచివాలయం స్వచ్చత గురించి పట్టించుకోక పోవటం బాధాకరని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

