జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మెట్టెల బాలరాజు, పి విజయలక్ష్మి, ప్రకాశ రావు, కామేశ్వర రావుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ పి కార్తిక్, ఆలయ కమిటి చైర్మన్ కోసనా గురు బ్రహ్మం, ఆర్.ఎ కాటూరి ప్రసాద్ లు ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.

