ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటిగంగలో ఏర్పాటు చేస్తున్న జై భీమ్ మాలల అన్నదాన సత్రం నిర్మాణానికి తిరుపతి, చిత్తూరు ఎంపీలు చేయూత ఇవ్వనున్నట్లు కమిటీ పెద్దలు తెలిపారు. అన్నదాన సత్రం కమిటీ గౌరవాధ్యక్షుడు వేమా శ్రీనివాసరావు, కార్యదర్శి పులి వికాస్, తదితరులు తిరుపతిలో ఎంపీ గురుమూర్తిని కలిసి సత్ర నిర్మాణం సాయం చేయాలని కోరడంతో ఎంపీ వెంటనే స్పందించి రూ.50 వేలు అందజేశారు. అలాగే చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావును తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారని కమిటీ సభ్యులు తెలిపారు.

