బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
వాయుగుండం నేరుగా తమిళనాడు వైపుగా రానుంది. దీని వలన ప్రభావం 28 నవంబర్ నుంచి పూర్తి స్ధాయిలో మన ఆంధ్ర రాష్ట్రం మీదుగా ఉండనుంది…ఇది నేరుగా శ్రీలంక కి దగ్గరగా కదులుతూ కేంద్రీక్రితం అయ్యింది. దీని ప్రభావం వలన రేపు నెల్లూరు – తిరుపతి జిల్లాల్లో ఉదయం వర్షాలను చూడగలము. కానీ అల్పపీడనం బలపడటం, అది వాయుగుండంగా మారడం వలన పూర్తి స్ధాయి భారీ వర్షాలు 28 నవంబర్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర (తిరుపతి – నెల్లూరు జిల్లాలు) మీదుగా పడనుంది. కానీ వాయుగుండం శ్రీలంకని తాకితే లేదా మధ్య తమిళనాడుని తాకితే పూర్తి స్ధాయి వర్షాలు దక్షిణ కోస్తాంధ్రకే పరిమితం అవుతుంది. కానీ కాస్త బలపడి చెన్నైకి దగ్గరగా వస్తే దక్షిణ కోస్తాంధ్రలో అతిభారీ వర్షాలు అలగే కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు । భారీ వర్షాలు కురిసేందుకు చాలా అనుకూలంగా ఉండనుంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
25
Nov