ప్రభుత్వం నిర్దేశించిన మ్యాపింగ్, జియోట్యాగింగ్ లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా నూరు శాతం పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ప్రభుత్వం నిర్దేశించిన మ్యాపింగ్, జియోట్యాగింగ్ లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పూర్తిగా ఈ విధులకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లను, ఎం.పి.డి.ఓ. లను ఆమె ఆదేశించారు. సోమవారం ఆమె ప్రకాశం భవనం నుంచి డివిజనల్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ ఫోటో తీసి జియోట్యాగింగ్ చేయాలని, అందరి బ్యాంకు ఖాతాలను ఎన్.పి.సి.ఐ.తో మ్యాపింగ్ చేయాలని, హౌస్ హోల్డ్ క్లష్టర్లను ఆయా హాబిటేషన్లు, గ్రామ పంచాయితీలు, రెవెన్యూ గ్రామాలతో మ్యాపింగ్ చేయాలని, హౌసోల్డ్ డేటాబేస్లో లేని వారి వివరాలను కూడా పొందుపరచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ లక్ష్యసాధనలో ప్రకాశం జిల్లా ఏమాత్రం వెనుకబడినా సహించబోనని, సచివాలయ సిబ్బంది ఈ దిశగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలాగా పర్యవేక్షించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

సచివాలయ సిబ్బంది అందరూ వంద శాతం బయోమెట్రిక్ హాజరు వేసేలా చూడాలని, విధులుపట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంవహిస్తూ దీర్ఘకాలిక సెలవులు పెట్టిన వారిపై దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సిబ్బందిపై సమగ్ర పర్యవేక్షణలేకపోతే ఎం.పి.డి.ఓ.లు, కమిషనర్ల పై తాను చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. బ్యాంకు ఖాతాల ఎన్.పి.సి.ఐ. అనుసంధానం గ్రామాల్లోని పోస్టాపీసుల్లో కూడా చేసుకోవచ్చనే విషయం పై అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన వివరాలను వెక్టార్ కంట్రోల్ హైజిన్ యాప్లో సమగ్రంగా నమోదు చేయాలని చెప్పారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఈ.ఓ.పి.ఆర్.డి.లకు నోటీసులు జారీ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు.

గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సి.ఎం.ఓ) నుంచి వచ్చే రిఫరల్ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి తగిన ఎండార్స్మెంట్ ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కోర్టు కేసుల విషయంలో కూడాఅప్రమత్తంగా ఉండాలని, సకాలంలో అవసరమైన కౌంటర్లు, రివ్యూ పిటిషన్లు, వకాలత్ లు సమర్పించాలని చెప్పారు.

అంగన్వాడీలలో టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను డిసెంబరు 10 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని కలెక్టర్ చెప్పారు. మండల స్థాయిలో సంబంధిత శాఖల ఇంజినీర్లు ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు. మంచినీటి ట్యాంకర్లకు బిల్లుల చెల్లింపు, తదుపరి చర్యలకు వాటర్ ఆడిట్ కీలకమైనందున సంబంధిత రిపోర్టులను మండలాల వారీగా సత్వరమే తనకు పంపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధిహామీ పనులు, గృహ నిర్మాణము, గ్రామీణ నీటి సరఫరాపైనా కలెక్టర్ సమీక్షించారు. ఆయా పనులలో స్పష్టమైన పురోగతి కన్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ డి.ఆర్.ఓ. బి.చినఓబులేసు, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, జడ్పీ సి.ఈ.ఓ. చిరంజీవి, డి.పి.ఓ. జి. వెంకటనాయుడు, హౌసింగ్ పి.డి. పి.శ్రీనివాస ప్రసాద్, ఐ.సి.డి.ఎస్.పి.డి. మాధురి, డి.ఎం.హెచ్.ఓ. పద్మజ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధరావు, భూగర్భ జల వనరుల శాఖ డి.డి. విద్యాసాగర్, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, దివ్యాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, స్పెషెల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, డి.ఆర్.డి.ఏ. పి.డి. వసుంధర, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బేబీరాణి, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్బాషా, కనిగిరి ఆర్.డి.ఓ. కేశవర్థన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *