తాళ్లూరు మండలంలోని లక్కవరం గ్రామంలో గంగభ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వరస్వామి, శ్రీకాశీతన్నపూర్ణాదేవి సమేత కాశీవి శ్వేశ్వరస్వామి ఆలయంలో కార్తీక చివరి సోమవారంను పురష్కరించుకుని, రుత్వి కులు వాసుస్వామి, శివభక్తులు కృష్ణస్వామి నేతృత్యంలో హోమం, రుద్ర మహాయజ్ఞం నిర్వహించారు.పురాతన చెన్న మల్లేశ్వరాలయంలో ప్రకాశంపంతులు ఆద్వర్యంలో హోమం నిర్వహించారు. కాశీవిశ్వేశ్వరస్వామిఆలయంలో శివభక్తులు కృష్ణస్వామి ఆద్వర్యంలో ప్రపంచశాంతి, లోకకల్యాణం, సనాతన ధర్మవృద్ది కోసం ఉదయం 10గంటలనుండి మద్యాహ్నం వరకు మహాయజ్ఞం నిర్వహించారు. మహాగణపతిపూజ, పుణ్యవాచనం, మహారుద్రాభిషేకం, శ్రీసూక్తం, పురుషసూక్తం, నవగ్రహాపూజలు, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. శివపార్వతులకు కళ్యాణం నిర్వహించి అభిషే కాలు చేపట్టారు. భక్తులు హోమాల్లో ఎండుకొబ్బరి, కర్పూరం, ఆవునెయ్యి, నవధా న్యాలు వేసిపూజలు నిర్వహించారు. శివశంకరునికి నిర్వహించినహోమకార్యక్రమానికి మండల పరిసరగ్రామాలకుచెందిన భక్తులతో పాటు ఇతరప్రాంతాల నుండి అధిక సంఖ్యలోభక్తులు హజరై యజ్ఞంను తిలకించారు..భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
భక్తులతోపోటెత్తిన ఆలయాలు
కార్తీక మాసం చివరి సోమవారం కావటంతోభక్తులు వేకువజామునే కార్తీక స్నానాలు చేసిశివాలయాలందు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.మండలంలోని తాళ్లూరు, తూర్పుగంగవరం, శివరాంపురం, బొద్దికూరపాడు, మాధవరం, గుంటిగం గ తదితర గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో,శివనామస్మరణలతో పోటెత్తాయి. ఆలయాల వద్ద శివలింగాకృతిలో కార్తీక దీపాలు వెలిగించారు. అఖండ కర్పూర జ్యోతులను వెలగించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
