గ్రామ ఉమ్మడి తిప్ప బీడు భూమిలోని మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తమ ఇష్టాను సారం బారీ వాహనాల తో మట్టి తరలిస్తుండటాన్ని
సోమవారం తూర్పుగంగవరం గ్రామస్తులు అడ్డుకున్నారు. తిప్పబీడులో మట్టి తోలేందుకు ఉన్న యంత్రాలను ఆభూమి నుండి బయటకు పం పటంతో తాత్కాలికంగా తరలింపు నిలిచి పోయింది. వివరాల్లోనికి వెళ్తే…..
తాళ్లూరు మండలంలోని నాగంబొట్ల పాలెం రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 299లోని తిప్పభీడుభూమి 190.50 సెంట్ల (పశువులమేత భూమి) తూర్పుగంగవరం గ్రామస్తులఉమ్మడిభీడుగా వుంది. ఆభూమి అన్యాక్రాంతం కాకుండా వుండేందుకు పూర్వం గ్రామానికి చెందిన 7 గురు పెద్దల పేర్ల మీద పట్టాదారులుగా రెవెన్యూరికార్డులో ఎఫ్ఎల్ఆర్ నమోదు చేశారు.
ఉమ్మడి తిప్పబడు పశువుల మేతభూమి) లో నాగంబొట్లపాలెం, రామభద్రాపురం, సోమవరప్పాడు తూర్పుగంగవరం తదితర గ్రామాలకు చెందిన పశువులు, గొ ర్రెలు, మేకలు మేతకు వెలుతుంటాయని, ఈబీ డునుండి గ్రావెల్ తరలిస్తే భవిష్య త్తులో మేత మేపుకు ఇబ్బందిగా వుంటుందని గ్రాస్తులు ఆందోళన చెంది పనులు అడ్డుకున్నారు. హైవే రోడ్డు నిర్మాణం పేరిట పనులు చేపడుతున్న కంపెనీ వారు ఎలాంటి అనుమతులు తీసుకోక గ్రావెల్ తరలిస్తుండగా, గ్రామస్తులు అనుమతి పత్రాలు చూపమన్నా చూపలేదు. దీంతో ఆ యాంత్రాలను, టిప్పర్లను ఆప్రాంతం నుండి బయటకు పంపి వేశారు. హైవే రోడ్డు కంటాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఉమ్మడి భూమి(పశువుల మేత భూమిగా) వున్నందున ఆభూమిలోని గ్రావెల్ పట్టాహక్కుదారులకు చెందిన అందరి కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో సంప్రదించి, ప్రభుత్వంకు దరఖాస్తు పెట్టుకుని మైనింగ్ అనుమతి పొందిన తరువాత గ్రావెల్ తోలుకోవాల్సి వుంది. ఉమ్మడి బీడుకు సంరక్షణగా వున్న పట్టాదారుల్లో కొందరు లాలూచి పడి హైవే నిర్మాణపనులు చేస్తున్న కంటాక్టర్ వద్ద కొంత నగదు తీసుకుని గ్రావెల్ తరలిస్తున్నారు. ఆభూమి పశువుల మేత భూమి అయినప్పటికి ఆభూమిని సంరక్షించేందుకు 7 గురు పెద్దల పేర్ల పట్టాలున్నా వారిలో కొందరు చెప్పినట్లుగా గ్రావెల్ తోలుతుండటంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. తిప్ప బీడులోని గ్రావెల్ ను తరలించేందుకు అనుమతి లేకుండానే గ్రావెల్ ను తరలిస్తున్నారు. సొంత అవసరాలకు, గృహాలవద్ద చదును కోసం గ్రావెల్ తరలిస్తే నానా హడావిడి చేసే మైనింగ్, పోలీస్, రెవిన్యూ అధికారులు భారీ యంత్రాలతో, అధిక సంఖ్యలో టిప్పర్లు తిరుగుతున్న పట్టించుకోని పరిస్థితి ఉన్నది.
ఆభూమిలో అనాధి నుండి మూడు, నాలుగు గ్రామాలకు చెందిన పశువులు మేస్తూ వుంటాయి. ముప్పవరం-బెంగులూరు హైవే నిర్మాణంలో భాగంగా పట్టాదారులకు
చెందిన ఇద్దరితో సంప్రదించి ఉమ్మడి తిప్ప బీడులోని గ్రావెల్ ను తరలిస్తున్నా రు. ఆభూమి ఉమ్మడి భీడు భూమిగా వుండి రికార్డులో పశువుల మేత భూమిగా వుంది. ఉమ్మడి భూమి(పశువుల మేత భూమిగా) వున్నందున ఆభూమిలోని గ్రావెల్ ను పట్టాహక్కుదారులకు చెందిన కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో సంప్రదించి, ప్రభుత్వంకు దరఖాస్తు పెట్టుకుని మైనింగ్ అనుమతి పొందిన తరు వాత గ్రావెల్ తోలుకోవాల్సి వుంది . హైవే రోడ్డు కంటాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్న వారు గ్రావెల్ తరలింపును అడ్డుకున్న వారిని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించటం తో ఇరువురి మద్యవాగ్వాదం జరిగి పరస్పరం దుర్బాషలాకున్నారు.
ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఉమ్మడి బీడుగా వున్న పశువుల మేతేభూమిలో అక్రమ మట్టి తవ్యకా లను నిలిపి వేసే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


