తాళ్లూరు మండలంలోని ఎరువుల దుకాణాలలో ఎరువుల శాంపిల్స్ సేకరించి నాణ్యతా పరీక్షల నిమిత్తం ల్యాబకు పంపిస్తామని అందులో ఏ మాత్రం రాజీ లేదని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరులో శ్రీ లక్ష్మి వెంకట రమణ ట్రేడర్స్ ను తనిఖీ చేసి శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ ను రీజనల్ కోడింగ్ కేంద్రానికి పంపనున్నట్లు చెప్పారు. ఎరువులు పంపిణీ, తీసుకున్న వారి పూర్తి వివరాలు, ఇన్ వాయిస్ తేదీలు స్పష్టంగా ఉండాలని అన్నారు. రికార్డులలో పూర్తి వివరాలు డీలర్లు నమోదు చేయ్యాలని కోరారు.
