సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ లోని షోల్డర్ సర్జరీ విభాగం, కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో ఆర్థోస్కోపిక్ కార్టిలేజ్ షోల్డర్ రిపేర్ అరుదైన సిస్టర్ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా బాస్కెట్ బాల్ ఆడుతూ భుజానికి గాయమైన 25 ఏళ్ల యువకుడికి ఆర్థోస్కోపిక్ కార్టిలేజ్ రిపేర్ సర్జరీని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ చీఫ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ బి చంద్రశేఖర్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు. గాయం కారణంగా తీవ్రమైన భుజం నొప్పితో బేగంపేట కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ కు 25 సంవత్సరాల యువకుడు వచ్చాడు. చీఫ్ ఆఫ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ బి చంద్రశేఖర్ నేతృత్వంలోని నిపుణుల బృందం పరీక్షించి భుజం లోపల కార్టిలేజ్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఆర్థోస్కోపిక్ విధానంలో కార్టిలేజ్ రిపేర్ చేయాలని నిర్ణయించి విప్లవాత్మక కొండ్రో పిల్లర్ సాంకేతికతను ఉపయోగించి శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం అవడంతో పాటు రోగి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆర్థోపెడిక్ సర్జరీలలో భుజం లో కార్టిలేజ్ రిపేర్ శస్త్ర చికిత్స అత్యంత సవాళ్లతో కూడుకున్నదన్నారు. ఇలాంటి సమస్యలకు సాంప్రదాయ చికిత్సల ద్వారా తాత్కాలిక ఉపశమనం మాత్రమే దొరుకుతుంది. ఆర్తోస్కోపిక్ సర్జరీ లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని కొండ్రో పిల్లర్ టెక్నాలజీ సాయంతో కార్డు లేదు రిపేర్ ను చేయగలిగామని తెలిపారు. ఈ చికిత్స తరువాత రోగి వేగంగా కోల్పోవడంతో పాటు మెరుగైన ఫలితాలు ఉంటాయని, ఈ శస్త్ర చికిత్స కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స అని ఆయన పేర్కొన్నారు. సకాలంలో భుజం డిస్ లొకేషన్, కార్టిలేజ్ గాయాలను చాలామంది నిర్లక్ష్యం చేయడంతో పాటు ఇతరత్రా చికిత్సల కారణంగా షోల్డర్ ఆర్థరైటిస్ వంటి కోలుకోలేని పరిస్థితికి దారితీస్తుందని, ప్రాథమిక దశలోనే గుర్తించి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అవసరమని డాక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. భుజం గాయాలు, నొప్పి, కదలికలు సరిగ్గా లేకపోవడం, థిస్ లొకేషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పనిసరిగా సరైన చికిత్స తీసుకోవడం అవసరం. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో ప్రపంచ స్థాయి ఆర్థోపెడిక్ కేర్ ను అందించడంతోపాటు అత్యాధునిక సదుపాయాలు, నిపుణులైన డాక్టర్ల బృందంతో అత్యుత్తమ సెంటర్ గా గుర్తింపు పొందిందని తెలిపారు.

