తాళ్లూరు- తూర్పుగంగవరం రోడ్ లో ఇటీవల రోడ్డు పనులు నిర్వహించి తారు రోడ్డు ఎత్తు పెంచి బాగు చేసారు. కాని సైడ్ మార్జిన్లలో మట్టి తోలక పోవటంతో ప్రమాదాలకు గురవుతున్నారనే విషయాన్ని… తెలుసుకున్న అధికారులు స్పందించి మంగళవారం మార్జిన్లలో మట్టిని తోలించారు. ఎట్టకేలకు మట్టిని తోలి ప్రమాదాలను నివారించిన అధికారులకు, కాంట్రాక్టర్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
