గత టిడిపి ప్రభుత్వంలో ఎన్ టిఆర్ హౌసింగ్ పథకంలో గృహాలు
నిర్మించుకుంటూ మధ్యలో ఆగి, బిల్లులు రాని గృహాలను గుర్తించాలని ఎంపీడీఓ సుందర రామయ్య కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం హౌసింగ్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. గృహాలు లేని లబ్ధిదారులను గుర్తించి వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. నూతన గృహాలు మంజూరు అయిన వెంటనే లబ్ధిదారులను త్వరిత గతిన గుర్తించటం, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయటం లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు.
