భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసా రెడ్డి అన్నారు. దర్శి లోని వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శ
మాట్లాడుతూ ….అన్నీ సామాజిక వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులు తెలుసుకున్నప్పుడే సమాజం బాగుంటుంద న్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే సమాజం అభివృద్ధి చెందు తుందని స్పష్టం చేశారు. దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ మాజీ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, ఎంపీటీసీల సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, కురిచేడు జెడ్పీటీసీ నుసుం నాగిరెడ్డి,మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, మాజీ దర్శి ఏఎంసి చైర్మన్ కేవీ రెడ్డి, , నాయకులు కొడవటి జాన్, పాలెపోగు డగ్లస్, కుంటా అచ్చారావు, అన్నవరపు రవి, మజ్ఞువలి పాల్గొన్నారు.

