వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ రైతులకు ఆదాయ వనరులు పెంచేలా కృషి చేస్తున్నట్లు వ్యవసాయాధికారి పసాద రావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని బొద్దికూర పాడు, చింతల పాలెం, వెలుగు వారి పాలెం గ్రామాలలో మంగళ వారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రబీలో సాగు చేసిన పంటలకు ఈ- క్రాప్, భీమా నమోదు చేసుకోవాలని కోరారు. పశు సంవర్థ శాఖ ద్వారా పశు గణన కార్యక్రమం జరుగుతుందని పిభ్రవరి 28 వరకు కార్యక్రమం జరగుతుందని చెప్పారు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న వ్యవసాయ, ఉద్యాన వన శాఖ, పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ పథకాలను రాయితీలను వివరించారు. ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, విఏఏలు సు సష్మ స్వరాజ్, షేక్ అజ్మీర్ లు పాల్గొన్నారు.
