బాలికల అభివృద్ధి, రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీఓ సుందర రామయ్య అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో బాగంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేసారు. కస్తూరి భా గాంధీ పాఠశాల నుండి వెల్లంపల్లి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కొవ్వోత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎంఈఓ జి సుబ్బయ్య, ఐసీడీఎస్ సూపర్ వైజర్ జ్యోతి, ఎపీఎం దేవరాజ్, ప్రిన్సిపాల్ సుజిత, హెచ్ఎం శేష గిరి, పీహెచ్ వైద్యుడు రాజేష్ యాదవ్, ఎఎస్సె మోహన రావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు ఓబులు రెడ్డి, వెంకట రావు, నాగేశ్వర రావు, హనుమంతా రెడ్డి, రామయ్య ,పీహెచ్ సి సీహెచ్ ఓ ప్రమీల, హెచ్ఎస్ రవి, హెచ్పీ కోటేశ్వరి, హెచ్ఎ మారం అంజి రెడ్డి, ఆరోగ్య,ఆశ కార్యకర్తలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.



