వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో క్లబ్ శాఖలను విస్తరింపజేసి సామాజిక సేవలు నిర్వహిస్తున్నాయని భారత దేశంలో ఏడు రాష్ట్రాల్లో భారీగా తమ శాఖలను విస్తరించి లక్ష మంది సభ్యులు గల వేయి క్లబ్బుల ద్వారా సామాజిక సేవలను నిర్వహిస్తున్నామని ఒక్క రోజులోనే కోటి సీట్ బాల్స్ తయారుచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించామని వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి శిద్ధా వేంకట సూర్యప్రకాష్ రావు తెలిపారు.
వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీ నారాయణ అధ్యక్షతన స్థానిక పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్స్ అందించే బృహత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శిద్ధా వేంకట సూర్య ప్రకాష్ మాట్లాడుతూ… వాసవి క్లబ్స్ ద్వారా అనేకానేకమైన సేవా కార్యక్రమాలు జరుపుతున్నామని, జూన్ జూలై మాసంలో జరిపిన సూర్యాస్తమ సేవలు డాన్ టు డస్క్ కార్యక్రమంలో ఏడు కోట్ల రూపాయలకు పైగా సేవా కార్యక్రమాలతో పాటు పర్మినెంట్ ప్రాజెక్టులను, సెప్టెంబర్ మాసంలోని వాసవి వారోత్సవాల్లో భాగంగా ఏడు రోజులు పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించడమే కాకుండా సేవా కార్యక్రమాలు స్ధానిక క్లబ్ సభ్యులు నిర్వహించారని, నిరంతరం జరిగే వాసవి క్లబ్ సేవలు ప్రవహించే నదిలాగా కొనసాగుతున్నాయని, ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీ నారాయణ కార్యదర్శి పి నందకుమార్ కోశాధికారి గుర్రం సునిల్ కుమార్ మరియు క్లబ్ సభ్యులను దాతలను అభినందించారు.
స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు తమ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందించమని అడిగిన నేపథ్యంలో నవంబర్ 24వ తేదీ విసిఐ ఇంటర్నేషనల్ ట్రెజరర్ శిద్ధా సూర్యప్రకాష్ రావు, జయశ్రీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పాఠశాలలోని 120 మంది పదవ తరగతి విద్యార్ధినులకు ఏడు సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ మరియు విద్యాసామగ్రిని దాతల సహకారంతో అందిస్తున్నామని క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ తమ అధ్యక్షోపన్యాసంలో తెలిపారు.
వాసవి క్లబ్స్ తమ సేవలను ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో నిర్వహించడం మరియు విద్యార్థులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న తెలిపారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన దాతలను సత్కరించి దాతల చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో గార్లపాటి బ్రహ్మానందం, దర్శి మనోహర్ చంద్రశేఖర్, పబ్బిశెట్టి వినోద్ కుమార్, పబ్బిశెట్టి గోవర్ధన్, నేరెళ్ల శ్రీనివాసరావు, మద్దు అరవింద లక్ష్మి, చీదెళ్ల వెంకటప్రసాద్, భూమా శ్రీనివాసులు, రాధా రమణ గుప్తా జంధ్యం,, గుర్రం కృష్ణ, పొట్టి వీర రాఘవరావు, అమరా సతీష్, క్వాలిటీ ప్రొవిజన్స్ శివ, డి. రాఘవరావు, కొప్పురావూరి సింహ తదితరులు పాల్గొన్నారు.






