ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని వీధి విక్రయదారుల ప్రయోజనం కోసం “స్వానిధి భీ – స్వాభిమాన్ భీ” పక్షోత్సవాలలో భాగంగా యూనియన్ బ్యాంక్ నుండి 69మంది స్వానిధి లబ్దిదారులకు రుణాలు పంపిణీ చేయడమైనది.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్ సాంబశివరావు పాల్గోని మాట్లాడుతూ .. …దరఖాస్తు చేసుకున్న ప్రతి స్వానిధి లబ్ధిదారులకు డిజిటల్ జర్నీ ద్వారా వెంటనే రుణాలు మంజూరు చేస్తున్నామని అవకాశాలను సద్వినియోగం చేసుకోమని తెలిపారు.
మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ ………..వీధి విక్రయదారుల సమగ్రభివృద్ధి, సాధికారత ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం స్వానిధి పథకం ను అమలు చేస్తున్నది. దీనిద్వారా ఎనిమిది రకాలైన సోషియో,ఎకనామిక్, భద్రత పథకాలలో వారు తప్పకుండా నమోదుకావాలని, వాటి ద్వారా వ్యాపారాలకు, కుటుంబానికి సెక్యూరిటీ ఉంటుందని, తెలియజేశారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, క్యూఆర్ కోడ్ స్కానర్ల వలన ఉపయోగాలు, డిజిటల్ ట్రాన్సాక్షన్ వలన వారికి ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుందని తెలియజేశారు. అధిక వడ్డీల బారినపడి చిరువ్యాపారులు చితికి పోకుండా ఉండేందుకు పీఎం స్వానిధి దోహదపడుతుంది.
ప్రధానంగా సోషల్ సెక్యూరిటీ స్కీoల ద్వారా పిఎం సురక్ష బీమా యోజన, పి.యం జీవనజ్యోతి బీమా యోజన, పీ.ఎం. జనదన్ యోజన, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, పి.యం జన సురక్ష యోజన,భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్, పి.యం మాతృ వందన యోజన, ఆయుష్ మాన్ భారత్, PMJJBY, మొదలగు వాటి గురించి వివరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో TE- (LH) N. జయ కుమార్, TE – (HN& SS) D. సంతోష్ కుమార్, ఒంగోలు సిటీ మిషన్ మేనేజర్ G. కల్పన మరియు ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ ఆర్గనైజర్ లు, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.


