అద్దంకి బస్టాండ్ సమీపంలో డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాల కోసం ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ ను పీడీ మెప్మా తేళ్ల. రవికుమార్, యూనియన్ బ్యాంకు రీజినల్ డెప్యూటీ హెడ్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్ సాంబశివరావు సందర్శించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ మహిళలకు బ్యాంకులు రుణపరపతి కోసం ఎన్నో మెరుగైన పథకాలను అమలుచేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మహిళలు ఆర్ధికాభివృద్ధివైపు, సుస్థిర జీవనోపాధుల, ఉత్పత్తి రంగాలలో రాణించాలని అభిప్రాయపడ్డారు.
వారు ప్రదర్శించిన ఉత్పత్తులను చూసి సంతోషాన్ని వ్యక్తం చేసి, ఇంకా మెరుగైన, ప్రయోజనకరమైన ఉత్పత్తులు మీ నుండి రావాలని కోరారు.
ఇందులో డ్వాక్రా ఉత్పత్తులను 1) కథ 2) వస్త్ర 3) ఆభరణ 4) ఆహా అని నాలుగు రకాలుగా వర్గీకరించి నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం జరిగిందని సిటీ మిషన్ మేనేజర్ జి.కల్పన, టీ ఈ జయకుమార్, సంతోషకుమార్ తెలిపారు.
ప్రతి నెలలో రెండు రోజులు నిర్వహించే మెప్మా అర్బన్ మార్కెట్ ను ఒంగోలు నగర ప్రజలు దర్శించాలని, కొనుగోలు చేయాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తేళ్ల. రవికుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ తేళ్ల . రవి కుమార్ తో పాటు యూనియన్ బ్యాంక్ అధికారులు శ్రీనివాసరావు, సాంబశివరావు మరియుTE- (LH) శ్రీ N. జయ కుమార్,TE – (HN& SS) శ్రీ D. సంతోష్ కుమార్, సిటీ మిషన్ మేనేజర్ శ్రీమతి G. కల్పన మరియు ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ ఆర్గనైజర్ లు, డ్వాక్రా ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.


