చిన్నారులు తిరు తిండ్లలో కురు కురే ప్యాకెట్స్ ఇతర హాని కలిగించే పదార్ధాలు తిన వద్దని ప్రధానోపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి కోరారు. వెలుగు వారి పాలెం ప్రాధమిక పాఠశాల ఆవరణలో విద్యార్థులకు కురు కురే ప్యాకెట్స్, ఇతర చిరు తిండ్లు ప్యాకెట్స్ లోని ఆహార చిరు తిండ్లను ఉంచి నిప్పు పెట్టారు. అవి ప్లాస్టిక్ వాసనతో కాలి పోవటాన్ని ప్రయోగ పూర్వకంగా విద్యార్థులకు వివరించారు. చిరు చిండ్లుగా నివాసంలో ఉండే పండ్లు, కాయలు, ఇతర చిరు తిండ్లు మాత్రమే తెచ్చు కోవాలని కోరారు.
