క్విస్ హైస్కూల్ విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటాడు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ 2024 జరిగింది. క్విస్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న సి.హెచ్. హరి హరన్ రెడ్డి జూనియర్స్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. వివిధ దేశాలకు చెందిన 1750 మంది పోటీలో పాల్గొనగా వివిధ రౌండ్లు దాటుకుంటూ ఫైనల్స్ కి చేరుకున్న హరిహరన్ మొదటి స్థానంలో నిలిచాడు. విద్యార్థులు కేవలం చదువు పరంగానే కాకుండా క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి తోడ్పడతాయని క్విస్ సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. సూర్య కళ్యాణ చక్రవర్తి, వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్. శ్రీగాయత్రి అన్నారు. బంగారు పతకం సాధించినందుకు హరిహరన్ ని అభినందించారు. క్విస్ హైస్కూల్ ప్రిన్సిపల్ కమలేశ్వరి, కరాటే మాస్టర్ డి.ఎస్. కుమార్, ఉపాధ్యాయులు హరిహరన్ ని అభినందించారు.
