పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయం ఆవరణలోని పునరుద్ధరించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ……. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనీ, ప్రతి ఒక్కరి ఆరోగ్య రక్షణకు సురక్షిత నీరు తీసుకోవడం అవసరమని తెలిపారు. పోలీస్ సిబ్బంది నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సొంత నిధులతో ఈ వాటర్ ప్లాంట్‌ను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే కూడా హాజరైనారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియపరిచినారు. పోలీస్ సిబ్బంది ఈ మినరల్ వాటర్ ప్లాంట్‌ను వినియోగించుకుని సురక్షితమైన నీటిని పొందాలని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ విధమైన సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, స్వచ్ఛమైన నీటిని సిబ్బందికి అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్, ఆర్.ఐలు రమణ రెడ్డి,సీతారామరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
