ఖో ఖో ప్రపంచ కప్ విజేత శివా రెడ్డి ని
జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా మంగళవారం అభినందించారు .
ఖో ఖో క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచానికి పరిచయం చేసి,మొదటి సారిగా ప్రపంచంలో 20 దేశాలు పోటీలో తలపడి,ఫైనల్ మ్యాచ్ నేపాల్,ఇండియా దేశాలు తలపడి విశ్వవిఖ్యాత “ప్రపంచ కప్”ను భారత్ సొంతంచేసికొని,ప్రపంచంలోని 195 దేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా వ్యాప్తిచెందేలా భారత ఖోఖో జట్టులోని 15మందిలో, ముఖ్యంగా “ప్రపంచ కప్”ను సొంతం చేసుకోవడానికి ప్రధాన కారణమైన భారత ఆణిముత్యం, ప్రకాశం ముద్దుబిడ్డ, ముండ్లమూరు మండల మారుమూల గ్రామం ఈదర నివాసి పోతిరెడ్డి.శివారెడ్డిని,ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ఘనంగా తన చాంబర్ లో సన్మానించారు.మారుమూల ప్రాంతంలో జన్మించి భారత ఆణిముత్యంగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో,శివారెడ్డి గురువు మేకల సీతారామిరెడ్డి,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబరు కపురం శ్రీనివాసరెడ్డి,డీఎస్ డి ఓ రాజరాజేశ్వరి,ఖోఖో అషోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరావు, షేక్ సాదిక్, ,మెలిక అంకమరావు తదతరులు పాల్గొన్నారు.
