పోలీస్ పెట్రోల్ బంక్ మరియు ఒంగోలు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. అర్ దామోదర్ -నేరాల కట్టడికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి -రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – జిల్లా ఎస్పీ

ఒంగోలు, కొత్తపట్నం సెంటర్ లో గల పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ ను జిల్లా ఎస్పీ ఏ. అర్ దామోదర్
తనిఖీ చేశారు. పోలీస్ పెట్రోల్ బంక్ చుట్టూ ప్రదేశాన్ని, బంక్ యొక్క నిర్వహణ మరియు సిబ్బంది పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలియచేసారు. పోలీస్ వాహనాలకు నిత్యం వినియోగించే డీజిల్,పెట్రోల్ నిర్వహణకు సంబంధించి అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. పెట్రోల్ బంక్ లో సి.సి.టి.వి.కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అనంతరం ఒంగోలు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ జిల్లా ఎస్పీ ఏ. అర్ దామోదర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాలు, పాత పోలీస్ క్వార్టర్స్,పెండింగ్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్ర పరిరక్షణ, నేర నియంత్రణ, మహిళా సమస్యల పరిష్కారంకు ప్రాధాన్యత విధులు ఉండాలని, అట్రాసిటీ కేసుల దర్యాప్తు త్వరిత గతిన పూర్తి చేసి బాధితులకు సకాలంలో పరిహారం అందేందుకు ప్రతిపాదనలు పంపాలని, బాలికలు/మహిళలు/యువకులు మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అత్యధిక ప్రాధాన్యతతో వాటిని విచారించి, అదృశ్యమైన వారి జాడ తెలుసుకోవాలని ఆదేశించారు. సబ్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, చట్ట వ్యతిరేకమైన అసాంఘిక కార్యక్రమాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

జిల్లా ఎస్పీ ఏ. అర్ దామోదర్
వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు, చీమకుర్తి సిఐ సుబ్బారావు, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఆర్ఐ సీతారామిరెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *