అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాధమిక విద్యలో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం రెండు విడుతల పాటు నిర్వహించనున్న జ్ఞాన జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య తెలిపారు. తాళ్లూరు ఎంఆర్పీ కార్యాలయంలో సోమవారం జ్ఞాన జ్యోతి కార్యక్రమం అమలు పై ఎంఈఓ లు సుబ్బయ్య, సుధాకర రావు, ఐసీడీఎస్ సీడీపీఓ సీహెచ్ భారతి, సూజర్ వైజర్ జ్యోతి, సీఆర్పీలు శ్రీ మన్నారాయణ, చంద్రిక, శివ రామి రెడ్డి లతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 18 నుండి 20 వరకు మొదటి విడుతగా, ఈనెల 22 నుండి 25 వరకు రెండవ విడుతగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఎంఈఓ సుబ్బయ్య తెలిపారు. శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనున్న అంగన్ వాడీ టీచర్లకు భోజన వసతి, టీఏ లు చెల్లించ బడునని చెప్పారు. అంగన్ వాడీ టీచర్లు అందరూ విధిగా శిక్షణలో పాల్గొనాలని సీడీపీఓ సీహెచ్ భారతి కోరారు.
