భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాటా వీరుడుగా పేరుగాంచిన చత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకొని బేగంపేట పురవీధులలో బిజెపి శ్రేణులు, శివాజీ మహారాజ్ అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు .ఈ సందర్భంగా భారతమాత ముద్దుబిడ్డ స్త్రీలను గౌరవించి హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు మాతాజీ నగర్ లో ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ బ్రాహ్మణవాడి, బేగంపేట, మయూరి మార్గ్,శ్యామలాల్ బిల్డింగ్ ,భగవంతపూర్, ప్రకాశం నగర్, పాటిగడ్డ, పోలీసు లైన్ ,ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో బిజెపి నాయకులు ఆనంద్ (నందు ) యమగోని గంగాధర్ గౌడ్,తారకంపేట శ్రవణ్ కుమార్, మహేష్ ,మధు, ప్రమోద్, హనీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


