ఆస్తిపన్ను ప్రాపర్టీ టాక్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం పి టి పి కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బేగంపేట్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించినట్లు బేగంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వి సమ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు పున సమీక్ష అభ్యర్థనలు ఆస్తిపన్ను సవరణలు కోర్టు కేసులు టాక్స్ కు సంబంధించిన ఏ సమస్య అయినా ఆఫీస్ కు వచ్చి తెలియజేయాలన్నారు. ప్రాపర్టీ టాక్స్ పరిష్కార కార్యక్రమం ఈనెల 22 నుంచి మార్చి నెల ఒకటి ,8, 15, 22 , 29 తేదీల్లో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సర్కిల్ ఆఫీస్ లో తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిసి సమ్మయ్య కోరారు.
