ముండ్లమూరు మండలంలోని మారళ్ళ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి పాత భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో నూతన భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అమరజీవి పొట్టి శ్రీరాములు బంధువులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై ఆర్యవైశ్యులు తహసిల్దారును కోరగా శుక్రవారం మారెళ్ళ గ్రామానికి వెళ్లి హాస్పిటల్ లో ఉన్న పాత భవనాన్ని పరిశీలించారు. ఆ భవన స్థానంలో శ్రీ పొట్టి శ్రీరాములు ఆయుర్వేదిక్ హాస్పిటల్ నిర్మించాలని వారు కోరారు. అందుకు సంబంధించిన నివేదికలను జిల్లా అధికారులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మారళ్ళ వైద్యాధికారి బి మధు శంకర్, సి హెచ్ ఓ డి వెంకటరావు, సూపర్వైజర్ సిహెచ్ నాగేశ్వరరావు, హెచ్ ఈ కోలాహలం అప్పలరాజు, ల్యాబ్ అసిస్టెంట్ ఆనందబాబు. నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
