రైతు రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ముండ్లమూరు, పసుపుగల్లు గ్రామాలలో శుక్రవారం రిజిస్ట్రీ ప్రక్రియను పరిశీలించి రైతుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ లోగా రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి, వన్ బి, ఆధార్, ఫోన్ నంబరు తో గ్రామ వ్యవసాయ సహాయకులు కలిసి మీ దగ్గర ఉన్న ఆధారాలు వారికి అందజేసిరిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దర్శి వ్యవసాయ సహాయ సంచాలకులు( ఏడిఏ) కె బాలాజీ నాయక్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు 11 విశిష్ట సంఖ్య గల కార్డును పొందవచ్చు అన్నారు. ఈ కార్డు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అందిస్తున్న పథకాలు పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ ఫరూక్, ఏఈఓ వేమూరి శ్రీ కీర్తి, ఆదిమూలం స్వాతి, వీఏఏ శోభారాణి, రైతులు పాల్గొన్నారు.
