విద్యార్థులు చిన నాటి నుండే ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకొని
ముందుకు సాగాలని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మా నాయక్ లు అన్నారు. అంబేడ్కర్ భవన్ లో శుక్రవారం సాంఘిక సంక్షేమాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 56 సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలలో పదవ తరగతి చదువు చున్న 934 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ సౌజన్యంతో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఆరు సబ్జెక్టులతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో తరగతులు నిర్వహించారు. విద్యార్థులు మానసిక ప్రశాంతతో సబ్జెక్టుపై అవగాహన పెంచుకుని అవసరమైన మేర సూటిగా జవాబులు వ్రాసి మంచి ఫలితాలు పొందాలని సబ్జెక్టు నిపుణులు సూచించారు. విద్యార్థులకు అల్ ఇన్ వన్ మెటీరియల్, స్టేషనరీ పంపిణీ చేసారు. డీఈఓ కిరణ్ కుమార్, జిల్లా చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ప్రసిడెంట్ నీలిమా, డిసీఈబీ సెక్రటరీ శ్రీనివాస రావు, ఎంఈఓ కిషోర్ కమార్, వసతి గృహా సంక్షేమాధిరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.




