ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లి, శ్రీనివాస్ నగర్, లక్ష్మీ నగర్ గ్రామాలలో జరిగిన పలు వివాహ కార్యక్రమాలకి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరైనారు. లక్ష్మీ నగర్ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు జక్కం నారాయణరెడ్డి కుమారుడు వరుడు జక్కం వంశీ రెడ్డి, కెల్లంపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు మొదుల్ల వెంకట రమణారెడ్డి కుమార్తె మొదుల్ల శ్రీవాణి, కొమ్మవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు గాదే చిన్న బాలకోటిరెడ్డి కుమారుడు వరుడు గాదే చిరంజీవి రెడ్డి వివాహ కార్యక్రమాలకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వధువు, వరుడు లకు అక్షింతలు వేసి ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రాకతో ఆయా గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మండల వైసిపి మాజీ కన్వీనర్ సూరి దేవర అంజయ్య, దర్శి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ రైతు అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానంద రెడ్డి, మాజీ సర్పంచి చింతా శ్రీనివాస్ రెడ్డి, గొంది వెంకట అప్పారెడ్డి, అన్నపురెడ్డి బిక్షాల్ రెడ్డి, వైస్ సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, మేకల వెంకటేశ్వర రెడ్డి, మొదుల్ల సుబ్బారెడ్డి, గాదె నాసర్ రెడ్డి, అబ్బనీ అంజిరెడ్డి, నిడమానూరిచెంచయ్య తదితరులు పాల్గొన్నారు.




