ఒంగోలు నగరంలో 125 సంవత్సరాలుగా సాహిత్య కళారంగాలకు, ఆటవిడుపుకు ఆలవాలమైనటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్ మరియు క్లబ్ ఎన్నికలు మార్చి 9వ తేదీ ఆదివారం జరుగుచున్నట్లు ఎన్నికలలో కార్యనిర్వాహక సభ్యులుగా పోటీ చేస్తున్న ధనిశెట్టి రాము ఒక ప్రకటనలో తెలిపారు.
సివిఎన్ రీడింగ్ రూమ్ లో సభ్యులుగా 970 మంది నగరంలోని అతిరథ మహారధులు కొనసాగుతున్నారని, గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా 2025 ఎన్నికలు కూడా నిర్వహించడానికి రీడింగ్ రూం ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఒక అధ్యక్షులు, ఒక ఉపాధ్యక్షులు, ఒక కార్యదర్శి, ఒక సహకార్యదర్శి, ఒక కోశాధికారి మరియు ఆరుగురు కార్యవర్గ సభ్యుల ఎన్నికకు పోటీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్లు ఫిబ్రవరి 19, 20 తేదీల్లో స్వీకరించగా… 22వ తేదీన పోటి విరమణ అనంతరం పోటీలో ఉన్నటువంటి పోటీదారుల వివరాలను ప్రకటించారు. ఆ మేరకు ప్రస్తుతం జరుగుతున్న పోటీలలో అధ్యక్ష పదవికి నలుగురు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు, కార్యదర్శి పదవికి ముగ్గురు, సంయుక్త కార్యదర్శి పదవికి ఇద్దరు, కోశాధికారికి ఆరుగురు, కార్యనిర్వాహక సభ్యుల పదవికి 12 మంది పోటీ పడుతున్నారని తెలిపారు.
తాను గత 14 సంవత్సరాలుగా సివిఎన్ క్లబ్ సభ్యులుగా ఉన్నానని, ఎల్ఐసి మరియు పోస్టల్ ఏజెంట్గా ప్రజలకు సేవలందిస్తూ సామాజిక సేవారంగంలో ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ లో కోశాధికారి బాధ్యతను నిర్వహించానని, ఒంగోలు నగరంలో ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి శ్రవణా నక్షత్ర శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కమిటీలో కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నానని మరియు రాజకీయపరంగా భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లాలో కీలక కార్యకర్తగా కొనసాగుతున్నానని ధనిశెట్టి రాము తెలిపారు. కావున మార్చి 9న జరిగే సిబిఎన్ రీడింగ్ రూమ్ మరియు క్లబ్ ఎన్నికల్లో సభ్యులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేయాలని విజ్ఞప్తి చేశారు.

