షేడ్ నెట్ ద్వారా మంచి దిగుబడులు వచ్చి రైతులు లాభాల బాట పడతారని రైతులకు షేడ్ నెట్ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని డిఆర్డీఏ డైరెక్టర్ టి నారాయణ అన్నారు. టిటిడీసీ కార్యాలయంలో శనివారం షేడ్ నెట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ డైరెక్టర్ టి నారాయణ మాట్లాడుతూ .. జిల్లాలో 36 మండలాలలో ఈ పంటలు షేడ్ నెట్లో ఏ కాలంలో పండించుటకు అనుకూలమో తగిన నివేదిక తయారు చెయ్యాలని కోరారు. షేడ్ నెట్ , అందులో వేసే పంటలకు భీమా ఉండేలా చూడాలని ఖేతి పౌండేషన్ సూచించారు. జిల్లా ఉద్యాన వనశాఖాధికారి గోపినాథ్ మాట్లాడుతూ జిల్లాలో 38 మండలాలలో కూరగాయలు, పూల మొక్కలు, నర్సీరీలు పెంచే రైతులు 200 మంది వ్యవసాయ రైతులను గుర్తించినట్లు చెప్పారు. రైతులకు షేడ్ నెట్ ఉపయోగాల గురించి సబ్సిడీ గురించి తెలిపారు. ఒక్కోక్క యూనిట్ ఖరీదు రూ. 3. 22 లక్షలు ఉండగా అందులో రూ. 50 శాతం సబ్సిడీ వస్తుందని చెప్పారు. ఎపీసీఎన్ఎఫ్ డీపీఎం సుభాషిణి మాట్లాడుతూ …. రైతులు పురుగు మందులు లేని వ్యవసాయాన్ని షేడ్ నెట్స్ లో ప్రకృతి వ్యవసాయం చెయ్యాలని అలా పండించిన పంటలకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. బ్యాంక్ లింకేజి డిపీఎం సునీత మాట్లాడుతూ అర్హత ఉన్న లబ్దిదారులకు షేడ్ నెడ్ కు అవసరమైన రుణాన్ని బ్యాంక్ ద్వారా ఇప్పిస్తామని చెప్పారు. ఉన్నతి కోఆర్డినేటర్ ఆల సుబ్రమణ్యంయ. లైవ్ లీ హుడ్ డీపీఎం డేవిడ్ తగిన సూచనలు చేసారు. ఖేతి బృందం వై ప్రశాంత్, సీహెచ్ గణేష్, ఉద్యన వన శాఖ అదికారి తేజ తదితరులు పాల్గొన్నారు.

