ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం ఎబీసీ హైస్కూల్ విద్యార్థులు ఆదివారం విజ్ఞాన విహార యాత్రను చేపట్టారు. విద్యార్థులకు కోటప్ప కొండ, చిన కాకానిలో ఉన్న హాయ్ ల్యాండ్ ను సందర్శించారు. కోటప్ప కొండ విశిష్టతను వివరించారు. విద్యార్థులకు విజ్ఞానంతో పాటు మానసిక, శారీరక ఉల్లాసం కోసం విజ్ఞాన పరిపక్వత కోసం విహాయ యాత్రను చేపట్టినట్లు ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వర రావు తెలిపారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, డైరెక్టర్ కాలేషా బాబు లు విద్యార్థులకు ఆయా ప్రాంతాల విశిష్టతను వివరించారు. ఎస్ఏ లు కొండల రావు, వెంకట రావు, సీఓ అనిల్, ఉపాధ్యాయులు షాని, రాజ్య లక్ష్మిలు విద్యార్థులను ఆయా ప్రాంతాలకు త్రిప్పి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

