ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ హర్షిణి డిగ్రీ కాలేజ్, ఒంగోలు లో ఉద్యోగ మేళా బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళా లో 51 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళా కు 1615 మంది అభ్యర్థులు హాజరువగా అందులో 506 మంది ఎంపికైన్నారు మరో 134 మంది 2 వ ఇంటర్వ్యూ కు ఎంపికైన నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్
తమీమ్ అన్సారియా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కృషి చేయాలని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెలెక్ట్ ఐన అభ్యర్థులు చిన్న, పెద్ద కంపెనీ అని చూసుకోకుండా కొంత కాలం అనుభవం వచ్చేంత వరకు పని చేస్తుంటే అభివృద్ధి చెందుతారని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అతిథిగా హాజరైన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత మాట్లాడుతూ….యువతకు ప్రైవేట్ రంగ ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వ భరోసా మేలుకలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ జి. రవికుమార్ మాట్లాడుతూ…. ఈయొక్క జాబ్ మేళని మా ప్రాంగణం లో నిర్వహించడం ఎంతో సంతోషం గా ఉందని తెలియజేసారు. నైపుణ్యలను మెరుగు పరచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశలు పొందవచ్చు నని సూచించారు. జిల్లా నైపుణ్యభివృద్ధిసంస్థ అధికారి రవితేజ మాట్లాడుతూ…. ప్రభుత్వం నైపుణ్యభివృద్ధి కేంద్రం ద్వారా అందుబాటులో ఉన్న శిక్షణ కార్యక్రమాలను వినియోగించు కోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి కల్పనాధికారి టి. భరద్వాజ్, స్టెప్ . సి. ఇ. ఒ శ్రీమన్నారాయణ, శ్రీ హర్షిణి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డి. ఆంజనేయులు, అధ్యాపకులు, ఉద్యోగ మేళా నిర్వహణలో భాగమైన అధికారులు, ఎపీఎస్సీఎస్డీసీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



