విశాఖపట్టణం క్రికెట్ స్టేడియం పేరు తొలగించడం పట్ల కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలు గాయపర్చిందని దర్శి నియోజకవర్గ
కాంగ్రెస్ ఇన్ఛార్జి కైపు వెంకట కృష్ణారెడ్డి అన్నారు. రాత్రికి రాత్రే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి
ఎసిఎ విడిసిఎ క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ఎసిఎ విడిసిఎ క్రికెట్ స్టేడియంగా మార్చారని అన్నారు. కూటమి ప్రభుత్వ తీరు ”అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుందని ” అన్నారు. ఆనాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉండగా ఎన్టిఆర్ పేరు మార్చి వైసిపి ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్ఆర్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్ లోని లాన్ కు ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించారనిఅన్నారు. వైఎస్ఆర్ జిల్లాను తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును తీసెయ్యడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ అంటే ఎందుకింత కక్షని ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టిఆర్ జిల్లాకు ఎన్టిఆర్ విజయవాడని లేక పాత కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆధ్యుడని అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేత, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు వంటి ప్రజాకర్షక పథకాల రూపశిల్పి వైఎస్ఆర్ అన్నారు.
